బ్రో మూవీ ట్రైలర్‌ వచ్చేసింది.. పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే

-

వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని సినిమా ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఇటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. అటు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సమయం వచ్చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోస్ట్ వెయిటెడ్ మల్టీస్టారర్ బ్రో సినిమా ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. రిలీజ్ అయిన క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ సంపాదించేసింది.

ట్రైలర్ లో ఓవైపు పవర్ స్టార్ .. మరోవైపు సాయిధరమ్ తేజ్.. ఇద్దరూ పోటీ పడి మరీ నటించినట్లు కనిపిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ టైమింగ్, కామెడీ అద్దిరిపోయాయి. వింటేజ్ లుక్స్ తో.. వింటేజ్ కామెడీతో పవన్ దద్దరిల్లేలా నటించేశాడు. ఈ చిత్రం తమిళ్ మూవీ వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కినా.. తెలుగు మార్క్ తో డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ సినిమా కోసం మరింత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ మూవీలో పవన్‌ ఎంట్రీ సినిమా స్టార్ట్‌ అయిన ఇరవై నిమిషాల తర్వాత ఉండబోతుందని ఇప్పటికే లీకైపోయింది. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రొమాంటిక్ ఫేం కేతిక శర్మ, వింక్ బ్యూటీ ప్రియా వారియర్ నటించారు. త్రివిక్రమ్‌ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news