ప్రమాదకరమైన వస్తువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే టైం బాగాలేకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక తాజాగా అమెరికాలో జరిగిన ఒక సంఘటన ఇదే విషయాన్ని తెలియచేస్తుంది. అమెరికాలోని ఒక ఇంట్లో భార్యాభర్తలు జీవిస్తుండగా.. సడెన్ గా భార్యకు గన్ ను ఎలా ఫైర్ చెయ్యాలి నేర్చకోవాలి అని భర్తను అడగడంతో, అతను ఆమెకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు… అయితే ఈ క్రమంలో బులెట్ గన్ లో ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోయిన బులెట్ ను తీయాలని ట్రై చేస్తున్న సమయంలో సడెన్ గా అది పేలడంతో సరిగ్గా గన్ కు ఎదురుగా ఉన్న భార్య కు తగిలింది, దీనితో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనను ఊహించని భర్త కూడా భార్య లేని జీవితం నాకెందుకు అనుకుని గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అసలు ఏమి జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
బులెట్ తగిలి భార్య మృతి … వెంటనే గన్ తో కాల్చుకుని భర్త ఆత్మహత్య !
-