హలో బాయ్స్‌..బ్లాక్‌ లిప్స్‌కు ఈ చిట్కాలతో చెప్పేయండి బైబై..!

-

మన ముఖంలో పళ్ల వరస, పెదాల రంగు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఇవి కరెక్టుగా ఉంటే వారి ముఖంలో ఒక కాంతి, కళ ఉంటుంది. నవ్వినప్పుడు ముత్యాలు రాలితాయోమో అనుకోవాలి. కానీ పాపం కొందరికి ఎత్తుపళ్లు, పళ్ల మధ్య గ్యాప్‌ వల్ల వారి ముఖం ఎంత బాగున్నా నవ్వడానికి సంకోచిస్తారు. ఇక ఫోటోలు అయితే సచ్చినా పళ్లు బయటపెట్టి దిగరు.

 

పెదాలు బ్లాక్‌గా ఉంటే ఆడవాళ్లు అయితే లిప్‌స్టిక్‌ వేసి కవర్‌ చేస్తారు. కానీ మగవారు అలా చేయలేరు. ఈ సిగిరెట్‌ వల్ల పెదాలు ఏమో నల్లగా అయిపోతాయి. కొంతమందికి విటమిన్స్‌ లోపం వల్ల కూడా పెదాలు నల్లగా మరతాయి. మరీ పురుషులు పెదాల నలుపు తగ్గాలంటే ఏం చేయాలి..? వీటికోసం కొన్ని క్రీమ్స్‌ ఉంటాయి. అయితే కొన్ని చిట్కాల ద్వారా కూడా మీరు ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.. అదేంటంటే..!

బీట్‌రూట్ జ్యూస్

బీట్‌రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇది డార్క్ పెదాలను కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. పడుకునే ముందు కొద్దిగా బీట్‌రూట్ రసాన్ని మీ పెదవులపై రాసి రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే కడగండి.

నిమ్మరసం

నిమ్మరసం సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. చర్మంపై పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి, నల్లబడిన పెదాలను కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. మీ పెదవులపై కొద్దిగా నిమ్మరసం అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే నిమ్మరసం పడకపోతే మాత్రం వదిలేయండి. దీనివల్ల పెదాలలో పగుళ్లు రావొచ్చు.

బాదం నూనె

ఆల్మండ్ ఆయిల్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది నల్లబడిన పెదాలను తేమగా, కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది. పడుకునే ముందు కొద్దిగా బాదం నూనెను పెదవులపై రాసి రాత్రంతా అలాగే ఉంచండి.

షుగర్ స్క్రబ్

లిప్ స్క్రబ్ తయారు చేయడానికి ఆలివ్ ఆయిల్ లేదా తేనెతో కొంత చక్కెర కలపండి. దీన్ని మీ పెదాలపై కొన్ని నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి, ఆపై శుభ్రం చేసుకోండి. ఇది మీ పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి, నల్లబడటానికి కారణమయ్యే మృత చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది.

దోసకాయ

దోసకాయలో శీతలీకరణ గుణాలు, సహజ మెరుపును అందించే లక్షణాలు ఉన్నాయి, ఇవి మీ పెదవులపై పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దోసకాయను ముక్కలుగా కట్ చేసి, వాటిని మీ పెదాలపై కొన్ని నిమిషాల పాటు రుద్దండి. సుమారు 10 నిమిషాలు అలాగే ఉంచండి, ఆపై నీటితో కడిగేసుకోండి.

అయితే టీవీ యాడ్స్‌లో చూపించినట్లు ఒక్కసారి చేయగానే పెద్ద మార్పు ఏం రాదు. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా నెల రోజుల పాటైనా ట్రై చేయండి. అప్పుడు మీరు గమనించే రిజల్ట్‌ వస్తుంది. దీంతోపాటు కెఫిన్‌ ఉన్న పదార్థాలు అంటే కాఫీ, టీలు తగ్గించండి, సిగిరెట్‌ కూడా జర తగ్గించేయరాదు..!

Read more RELATED
Recommended to you

Latest news