BRO : ఇవాళ ‘BRO’ ప్రీ రిలీజ్ ఈవెంట్..

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ మొదటిసారి నటిస్తున్న చిత్రం బ్రో. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతంకి రీమేక్ గా వస్తోంది. ఇక తమిళ్ లో చేసిన సముద్రఖని ఈ సినిమాను రీమేక్ చేస్తూ డైరెక్ట్ చేస్తున్నారు.

అయితే… పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘BRO’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ జరగనుంది. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించనున్నట్లు మూవీ టీం ప్రకటించింది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈనెల 28న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version