త్రివిక్రమ్ కి బంపర్ ఆఫర్, భారీ ప్రాజెక్ట్…!

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఇక హీరోలు కూడా త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి వేరే సినిమాలను వదులుకునే పరిస్థితి ఉంటు౦ది. ఆయన దర్శకత్వంలో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురములో సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో ఆయన కమర్షియల్ దర్శకుడిగా పూర్తి స్థాయిలో మారిపోయారు.

వరల్డ్ వైడ్ గా ఆ చిత్రం 200కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో త్రివిక్రమ్ కి డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు ఆయన. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రానుంది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఎన్టీఆర్ షూటింగ్ కి రాకపోయినా ఇతర పాత్రల షూటింగ్ ని మొదలుపెట్టాలని త్రివిక్రమ్ భావించాడు. కాని కరోనా కారణంగా ఆగిపోయింది.

ఇప్పుడు ఆయనకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఓ వ్యాపారవేత్త కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారని ఇందుకోసం దాదాపు 45 కోట్ల వరకు త్రివిక్రమ్ వసూలు చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాను దాదాపు 200 కోట్లతో నిర్మించనున్నారని టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా తర్వాత ఈ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.