బాలీవుడ్ లో బన్ని స్కెచ్ అదిరిపోయింది ..సుకుమార్ లేక్కే వేరని తేలిపోయిందా …?

-

సుకుమార్ అల్లు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. అంతేకాదు పుష్ప పాన్ ఇండియా సినిమా రూపొందిస్తూన్న సంగతి తెలిసిందే. సౌత్ ఇండియాలోని అన్ని ప్రధాన భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. అందుకే బాలీవుడ్ ఎంట్రీకి సుకుమార్, బన్నీ గట్టి ప్లాన్స్ వేసుకుంటున్నారట.

 

సుకుమార్ టేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాగే పర్ఫార్మెన్స్ లో బన్నీ స్టామినా గురించి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా సుకుమార్ స్క్రిప్ట్ లో చిన్న మార్పులు, జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక బన్నీ కూడా తన యాక్టింగ్, డాన్స్ తో మెస్మరైజ్ చేయడానికి చాలా కేర్ తీసుకుంటున్నాడట. పుష్ప సినిమాలో బన్నీ స్టెప్స్ కూడా అద్భుతంగా ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవీశ్రీప్రసాద్ సాంగ్స్ కూడా బన్నీ కి తగ్గట్టే ఉంటాయట.

ఫోక్ బీట్ లో సాగే సాంగ్స్ కి బన్నీ మాస్ స్టెప్స్ అదిరిపోతాయని అంటున్నారు. ఇప్పటికే బన్నీ డాన్స్ ఎలా ఉంటుందో బాలీవుడ్ ప్రేక్షకులకి బాగా తెలుసు. అంతేకాదు బాలీవుడ్ స్టార్స్ కూడా బన్నీ డాన్స్ ఫిదా అవుతుంటారు. ఇక హీరోయిన్స్ అయితే ఎపుడు ఛాన్స్ వస్తుందా తనతో కలిసి కాలు కదుపుదామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటి రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటిని తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version