బీచ్ లో బీరు తాగుతూ వీడియోని షేర్ చేసిన బన్నీ హీరోయిన్..!!

-

టాలీవుడ్ హీరోయిన్ భాను శ్రీ మెహ్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ వరుడు సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ సినిమా సమయంలో ఆ మూవీకి ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదని చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్ కి చాలా ఎక్కువ హైప్ ఇచ్చారు. ఎక్కడా కూడా ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతున్నా కూడా సగం సినిమా అయ్యేవరకు కూడా హీరోయిన్ ముఖం కనిపించదు. ఇలా డిఫరెంట్ గా చేస్తే సినిమా సక్సెస్ అవుతుందని అనుకున్నారు.. కానీ ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ ఒక్క సినిమాతోనే భాను శ్రీ కూడా మళ్లీ కనిపించకుండా పోయిందని చెప్పాలి.

ఇకపోతే ఈ సంగతి పక్కన పెడితే.. వరుడు సినిమా తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు ఏవి కూడా ఈమెకు రాలేదు. మరొక వైపు సైడ్ క్యారెక్టర్లు వచ్చాయి కానీ చేయకుండా సినిమాలు వదిలేసి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో సందడి చేయడం మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట రీల్స్ చేసేది.. ఇప్పుడు ట్రావెలింగ్ వీడియోలు చేస్తోంది. ఇక తాజాగా వియత్నాం వెకేషన్ కి తన అక్కతో కలిసి వెళ్లినట్టుంది. అక్కడ బీచ్ లో బీరు తాగుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

బికినీ వేసుకొని బార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేయడమే కాదు ఎవరైనా వియత్నాం వెళ్లాలి అనుకుంటే ఎక్కడెక్కడ మంచి ఆల్కహాల్ దొరుకుతుందో కూడా ఆ వివరాలను ఇస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇకపోతే మంచిగా హ్యాంగ్ అవుట్ అవ్వాలి అనుకుంటే ఎక్కడికైనా వెళ్లాలి లాంటి వివరాలను కూడా ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరిస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే ఈమె ఇలా మద్యం సేవిస్తూ షేర్ చేసిన వీడియోలు చూసి నెటిజెన్లు విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news