తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన మామన్నన్ తెలుగులో నాయకుడు గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్,కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించినఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కి మరిసెల్వరాజ్ దర్శకత్వం వహించారు. మామన్నన్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ‘నాయకుడు’ ట్రైలర్ ని లాంచ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక దళిత ఎమ్మెల్యే కొడుకుగా ఉదయనిధి స్టాలిన్ నటించాడు. రాజకీయ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకొనేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన వడివేలు.. ఈ సినిమాలో సీరియస్ గా కనిపించి నట విశ్వరూపం చూపించాడు. “నేను పాడుతున్న పాట ఒకే పాట అయ్యిండాలి. ఆ పాట నేను జీవితాంతం పాడుతూ వుండాలి. నా పొట్ట నుంచి పేగులు తీసి దానితో వీణ చేసి దాన్ని వీధి వీధిన మీటుతున్నాను. నిజాన్ని వినే చెవుల్ని నేను వెదుకుతున్నాను” అంటూ వడివేలు వాయిస్ తో మొదలైన ట్రైలర్.. గూస్ బంప్స్ ను తెప్పిస్తోంది.
ఇక విలన్ గా ఫహద్ ఫాజిల్ నటన అద్భుతమని చెప్పాలి. దళితులును.. ఊరిలోకి వస్తే కఠినంగా చంపేసే గ్రామంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ దళితుల కోసం ఎమ్మెల్యే నుంచి ముఖ్యంమత్రిగా ఒక తండ్రి ఎలా మారాడు. ఆ తండ్రి ఉద్యమానికి కొడుకు ఏ విధంగా సపోర్ట్ చేశాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ అందించిన నేపధ్య సంగీతం ఇంటెన్సిటీ మరింత ఎలివేట్ చేసింది. కెమరా పనితనం, నిర్మాణ విలువలు వున్నంతంగా వున్నాయి. మరిసెల్వరాజ్ ‘నాయకుడు’తో మరో హార్డ్ హిట్టింగ్ టెర్రిఫిక్ సినిమా అందించారని ట్రైలర్ భరోసా ఇచ్చింది. తమిళ్ లో హిట్ అందుకున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.