ఆరెక్స్ 100 డైరక్టర్ కు క్రేజీ గిఫ్ట్

-

ఇటీవల కాలంలో పెట్టిన బడ్జెట్ కు పదిరెట్లు లాభం తెచ్చిన సినిమా ఆరెక్స్ 100. అజయ్ భూపతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ చేశారు. ఇక ఈ సినిమా నిర్మాతకే కాదు డిస్ట్రిబ్యూటర్స్ కు కాసుల పంట పండేలా చేసింది ఆరెక్స్ 100. రిలీజ్ అయిన అన్నిచోట్ల లాభాలు తెచ్చుకున్న ఈ సినిమా 3 కోట్ల బడ్జెట్ తో రాగా 25 కోట్ల దాకా కలెక్ట్ చేసింది.

ఇక ఈ సినిమా దర్శకుడు ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంటున్నాడు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా మరో రెండు ఛాన్సులు అందుకుందట. ఈ సినిమా నిర్మాత సినిమా సూపర్ హిట్ అయిన కారణం చేత దర్శకుడు అజయ్ భూపతికి అదిరిపోయే గిఫ్ట్ అందించాడట. జీప్ కంపెనీ నుండి వచ్చిన కారుని అజయ్ కు ఇచ్చాడట.

శ్రీమంతుడు నుండి ఇలాంటి కానుక పర్వం కొనసాగుతుంది. హిట్ సినిమా ఇచ్చిన దర్శకులకు ఈ కానుకలు మరింత ఉత్సాహం తెస్తున్నాయని చెప్పొచ్చు. ఆరెక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి అజయ్ భూపతికి కారు గిఫ్ట్ ఇచ్చిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version