అమ్మడి ఫేట్ అర్జున్ రెడ్డి మారుస్తాడా..!

-

ఒడ్డు పొడుగు.. అందం అభినయం అన్ని ఉన్నా ఒక్కోసారి లక్ కలిసి రాక హీరోయిన్స్ వెనుకపడి ఉంటారు. స్టార్ హీరోయిన్ మెటీరియల్ ఉన్నా సరే వారికి తగిన క్రేజ్ అందుకోవడంలో వెనుకడుగు వేస్తారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సి వస్తే ముందు వరుసలోనే ఉంటుంది కేథరిన్ త్రెసా. కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు తెలుగులో చమ్మక్ చల్లో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే లైం లైట్ లోకి పూరి తీసిన ఇద్దరమ్మాయిలతో మాత్రమే వచ్చింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమాలో అడపాదడపా కనిపించినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో ఇంకా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కేథరిన్ కు అర్జున్ రెడ్డి రూపంలో అదృష్టం వచ్చింది. యువ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ఓ సినిమా వస్తంది. ఈ సినిమాలో కేథరిన్ త్రెసా ఇంపర్టెంట్ రోల్ చేస్తుందట. సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. మరి విజయ్ చేతుల్లో పడ్డాక అయినా కేథరిన్ త్రెసా కెరియర్ ఊపందుకుంటుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version