ఏంటి వీళ్ల పేర్లు ఇవి కావా..? గుర్తింపు తెచ్చిన సినిమా టైటిల్‌లే ఇంటిపేరుగా మార్చుకున్న సెలబ్రెటీలు వీళ్లే..!!

-

తెలుగు సినిమా ఇండ్రస్ట్రీలో ఎంతో మంది నటీనటులు ఉన్నారు. అందరికీ వారి పేర్లు పూర్తిగా తెలియవు. ఎన్నో ఎళ్లగా సినీపరిశ్రమలో ఉన్నా గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. అలా గుర్తింపు తెచ్చిన సినిమానే పేరుతో పాటు జోడించుకుని ఇప్పుడు వారి అసలు పేరే అది అన్నట్లుగా మారిపోయిన నటీనటులు గురించి చూద్దామా..! కచ్చితంగా అర్రే ఇతని పేరు ఇది కదా..! అను షాక్‌ అవుతారు.!

సత్యం రాజేష్

సత్యం సినిమాతో రాజేష్ పేరు తెచ్చుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సత్యం రాజేష్ పేరుతోనే కొనసాగుతున్నారు.

దిల్ రాజు

ప్రొడ్యూసర్‌గా దిల్ రాజు మొదటి సినిమా దిల్ అవ్వడంతో ఆ సినిమా తన పేరులో చేర్చుకున్నారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి

సీతారామ శాస్త్రిగారు సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. అలా సిరివెన్నలను తన పేరు పక్కన చేర్చుకున్నారు.

అల్లరి సుభాషిణి

అల్లరి సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించిన సుభాషిణికి ఆ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. దాంతో అల్లరి సుభాషిణిగా ఫేమస్ అయ్యారు.

వెన్నెల కిషోర్

వెన్నెల సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కిషోర్ ఆ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని వెన్నెల కిషోర్‌గా గుర్తింపు పొందుతున్నారు. ఇన్నిరోజులు ఇతని పేరే వెన్నల కిషోర్‌ అనుకున్నారు కదా.!

బొమ్మరిల్లు భాస్కర్

దర్శకుడిగా తన మొదటి సినిమా అయిన బొమ్మరిల్లుని తన పేరు పక్కన చేర్చుకున్నారు భాస్కర్.

అల్లరి నరేష్

హీరోగా నరేష్ నటించిన మొదటి సినిమా అల్లరి అవ్వడంతో నరేష్ అల్లరి నరేష్‌గా గుర్తింపు పొందారు.

రంగస్థలం మహేష్

మహేష్ అంతకుముందు జబర్దస్త్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అయినప్పటికీ రంగస్థలంలో తన పాత్రకి చాలా గుర్తింపు రావడంతో తర్వాత నుండి రంగస్థలం మహేష్ గా ఫేమస్ అయ్యారు.

శుభలేఖ సుధాకర్

శుభలేఖ సినిమాతో సుధాకర్ చాల గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ తరం వారికి ఈయన గురించి పెద్దయా తెలిసి ఉండకపోవచ్చు.

బాహుబలి ప్రభాకర్

ప్రభాకర్ అంతకముందు చాలా సినిమాల్లో నటించినా కూడా బాహుబలి సినిమాతో ఇంకా గుర్తింపు రావడంతో బాహుబలి ప్రభాకర్‌గా ఫేమస్ అయ్యారు.

షావుకారు జానకి

షావుకారు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జానకి షావుకారు జానకిగా గుర్తింపు పొందారు.

ఛత్రపతి శేఖర్

శేఖర్ కూడా అంతకముందు చాలా సినిమాల్లో నటించినా కూడా ఛత్రపతి సినిమాతో ఫేమస్‌ అయ్యారు. ఆ తర్వాత నుండి ఛత్రపతి శేఖర్‌గా పాపులర్ అయ్యారు.

వీళ్లే కాదు.. ఇంకా చాలా మంది కేరీర్‌ మొదలైన సినిమానో లేక గుర్తింపు తెచ్చిన సినిమాను వారి పేరు పక్కన చేర్చుకుని ఇంటిపేరుగా మార్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version