వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్‌ అడ్డంకులు.. విడుదలకు సిద్దం..!

-

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఈ సినిమా పై తెలంగాణ హైకోర్టులో కాస్త ఊరట లభించిందనే చెప్పాలి.  ఇటీవలే  ఫిబ్రవరి 09లోగా సెన్సార్ రిపోర్టు ఇవ్వాలని కోర్టు  ఆదేశాలు జారీ చేయడంతో.. కోర్టు చెప్పినట్టుగానే ఇవాళ సెన్సార్ రిపోర్టుని సబ్ మిట్ చేశారు. దీంతో ఈ సినిమాను విడుదల చేసుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 16న వ్యూహం సినిమా విడుదల చేసుకునేందుకు అనుమతి లభించింది. 

అంతకు ముందు సినిమా పై సెన్సార్ బోర్డు రివ్యూ చేసి నాలుగు వారాలలోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది చిత్ర యూనిట్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాని నారా లోకేష్ ఈ సినిమా పై పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ స్వ లాభం కోసం ఈ సినిమాను తెరకెక్కించారని పిటిషన్ లో పేర్కొన్నాడు నారా లోకేష్. ఇక ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు..  రెండు, మూడు సార్లు  విడుదలను నిలిపివేస్తూ.. ఉత్తర్వులను జారీ చేసింది. తాజాగా విడుదల చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ నెల 16న విడుదలకు వ్యూహం సినిమా సిద్ధం అయింది. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్ చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news