మహిళలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు… ఒక్కొక్కరికి రూ.5 వేలు..!

-

కేంద్రం ఎన్నో విధాలుగా ప్రజలకి సహాయం చేస్తూ వుంది. అయితే తాజాగా మోదీ సర్కార్ మహిళల కోసం ప్రత్యేకమైన సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చేటట్టు కనపడుతోంది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని అత్యవసర సమయాల్లో డబ్బులు అందుబాటులో ఉండేలా తీసుకు వస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

రూ.5,000 కి అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఫెసిలిటీ గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు మాత్రమే. ఓవర్ డ్రాఫ్ట్ కూడా ఒకరమైన రుణం అనే చెప్పుకోవచ్చు. దీనితో బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు పొందొచ్చు.

ఎక్కువగా తీసుకున్న డబ్బులను నిర్ణీత గడువులోగా మళ్లీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులకు వడ్డీ కూడా పడుతుంది. బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు దీనిని ఇస్తాయి. ఈ ప్రయోజనం స్వయం సహాయక గ్రూప్‌లోని మహిళలకు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి.

వెరిఫైడ్ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు రూ.5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అందిస్తామని తెలిపింది కేంద్రం. అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ కింద ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈ ఫెసిలిటీకి 5 కోట్ల మంది మహిళలు అర్హులనే అంచనాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news