డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డ్డ వ‌ర్ష ఇమాన్యుయేల్..!

జ‌బ‌ర్ద‌స్త్ పెయిర్ ఇమాన్యుయేల్ వ‌ర్ష డ్రంక్ అండ్ డైవ్ లో పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. వీరితో పాటూ ఆటో రామ్ ప్ర‌సాద్ మ‌రియు రాకెట్ రాఘ‌వ కూడా ఉన్నారు. అయితే వ‌ర్ష మరియు ఇమాన్యుయేల్ ప‌ట్టుబ‌డింది నిజంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కాదు. న్యూయ‌ర్ కోసం జ‌బ‌ర్ద‌స్త్ భార్య‌లు వ‌ద్దు పార్టీ ముద్దు అనే పేరుతో స్పెష‌ల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసింది. కాగా తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్ ప్ర‌సారం చేసింది.

ప్రోమోలో న్యూయ‌ర్ పార్టీ ఎంజాయ్ చేస్తూ వ‌స్తుండ‌గా వీరిని థ‌ర్టీ ఇయ‌ర్స్ పృధ్వీ ప‌ట్టుకున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా బిగ్ బాస్ క‌పులు వితికా షెరు మ‌రియు వ‌రుణ్ సందేశ్ కూడా ఉన్నారు. అంతే కాకుండా ఈ ప్రోమోలో ఆర్జీవి కూడా సంద‌డి చేశారు. ఎంతో ఎంట‌ర్టైన్మెంట్ ఉన్న ఈ ఎపిసోడ్ న్యూయ‌ర్ సంధ‌ర్భంగా ప్ర‌సారం చేయ‌నున్నారు. మ‌రి ప్రోమో లోనే ఇంత కామెడీ ఉంటే ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.