సోమవారం హైదరాబాద్ లో చంద్రమోహన్ అంత్యక్రియలు

-

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూసారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 9.45 గంటలకు హృద్రోగంతో తుదిశ్వాస విడిచారు చంద్రమోహన్‌.. ఆయన వయస్సు 82 ఏళ్లు.. సోమవారం హైదరాబాద్ లో టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి.

కాగా, ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను చంద్రమోహన్ అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరనిలోటని అన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంత చేసుకున్నారని తెలిపారు.

మరోవైపు చంద్రమోహన్ మృతి బాధాకరమని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఆయన తన నటనతో తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారని తెలిపారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news