బయోపిక్‌లతో నాయకులను ఒక ఆట ఆడుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్‌తో ప్రకంపనలు సృష్టించాడు. ఆర్జీవీ జయలలిత బయోపిక్ శశికళ తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మరో కేసీఆర్ బయోపిక్ “టైగర్ కేసీఆర్” ప్రకటించిన ఆర్జీవీ ఈరోజు (ఏప్రిల్ 20) 11 గంటలకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నాడు. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్‌లో తెలిపాడు. అయితే ఈ టైగర్ కేసీఆర్ చిత్రంలోని తను చూపించబోయే పాత్రలు కూడా రివీల్ చేశాడు. కేటీఆర్, కవిత, హరీష్ రావు, వైఎస్సార్, వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి, రోశయ్యా, కిరణ్ కుమార్ రెడ్డి, రామోజీరావు, లోకేష్ తదితర పాత్రలు ఈ చిత్రంలో ఉంటాయని తెలిపాడు.
మొత్తంగా ఈ చిత్రం రెండు రాష్ట్రల మద్య చిచ్చు రేపనుందా…? ఎందకుకంటే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతల అంశం చాలా సున్నితమైనది. లక్ష్మీస్ ఎన్టీఆర్, వీరప్పన్, ఇంకా ఏ బయోపిక్‌లైనా వ్యక్తులకు సంబంధించింది.. ఇక్కడ కేసీఆర్ అనే సరికి రెండు రాష్ట్రాల ప్రజలతో ముడి పడిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి.. వర్మ కొంచెం వళ్లు దగ్గర పెట్టుకొని తీయలని వార్నింగ్‌లు కూడా వినిపిస్తున్నాయి..
టైగర్ కేసీఆర్ లోని పాత్రలు.. వర్మ రెండు రాష్ట్రాల మద్య చిచ్చు పెట్టనున్నాడా.?
-