ఛీ..ఛీ.. సమంత ఇంత మోసం చేస్తుందనుకోలేదు – విజయ్ దేవరకొండ..!

-

ప్రముఖ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా , విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఖుషి. ఈ సినిమా కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అటు సమంత ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా చాలా కాలంగా మంచి హిట్టు కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో లవ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న మీడియా మిత్రుల కోసం ఈ సినిమా ప్రీమియర్ షో వేయగా.. ఇందులో సమంత , విజయ్ దేవరకొండ పోటీపడి నటించారని కచ్చితంగా ఈ సినిమా హిట్ మూవీ అవుతుందని అందరూ కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటలే ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1వ తేదీన విడుదలకు సిద్ధం కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు విజయ్ దేవరకొండ. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కవర్ చేసి వచ్చిన ఆయన.. అలాగే ఈ మధ్య వెకేషన్ నుంచి ఇండియాకి వచ్చిన సమంత కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.

ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల , సుమా హోస్టుగా వ్యవహరించిన ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి విజయ్ దేవరకొండ ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. అంతేకాదు సమంత చాలా చీట్ చేస్తుందని.. తనెప్పుడు అలా చీట్ చేస్తుందని ఊహించలేదు అని కూడా చెప్పుకొచ్చారు. “నాకు సమంత మీద ఎంత గౌరవం అంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత ఆమె ఇంటలిజెన్స్ తెలిసింది.. నేనే ఇంటలిజెంట్ అని నా ఫీలింగ్ అసలు బోర్డు గేమ్స్ లో సమంత ఎంత చీట్ చేస్తుంది అంటే అన్ని కూడా ఒప్పుకునేలా ఉంటాయి..ఛీ..ఛీ.. ఇంత మోసం నేనెప్పుడూ చూడలేదు” అంటూ సరదాగా కామెంట్లు చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version