మంచిర్యాలలో దారుణం..గర్భిణి కడుపులోనే క్లాత్ ను మర్చిపోయిన వైద్యులు

-

మంచిర్యాలలో దారుణం చోటు చేసుకుంది. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాకం బయటపడింది. గర్భిణి కి డెలివరీ చేసి…వైద్యులు క్లాత్ ను మర్చిపోయింది. వేమనపల్లి మండలం నిల్వాయికి చెందిన లయా అనే గర్భిణీ కి జిల్లా ఆసుపత్రిలో డెలివరీ చేశారు వైద్యులు.

డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గర్భిణీ మూత్ర విసర్జన నిలిచిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో రాత్రి చెన్నూర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు అక్కడ క్లాత్ తొలగించారు. మళ్ళీ మంచిర్యాల ఆసుపత్రి కి తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version