గుంటూరు కారం సినిమాలో చెప్పవే చిరుగాలి సాంగ్.. పాడింది ఎవరో తెలిస్తే షాక్

-

గుంటూరు కారం సినిమా నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో మహేశ్ బాబు కల్ట్ మూవీలోని ఓ వింటేజ్ సాంగ్ను రీమేక్ చేయనున్నారట. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే? ఆ పాటను ఏకంగా మహేశ్ బాబు పాడనున్నారట. ఇంతకీ ఆ పాట ఏంటో తెలుసా? కోట్లాది మంది ప్రేక్షకులను ఫిదా చేసిన ఒక్కడు సినిమాలోని చెప్పవే చిరుగాలి సాంగ్.

గుంటూరు కారం మూవీలో హీరోయిన్ శ్రీలీలను ఇంప్రెస్ చేయడానికి మహేశ్ ఈ చెప్పవే చిరుగాలి పాటను పాడారట. అయితే మొత్తం సాంగ్ కాదని, కేవలం ఫస్ట్ రెండు లైన్లను మహేశ్ తన స్టైల్లో పాడినట్లు సమాచారం. డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా సరైన మసాలా డోస్ ఇచ్చేలా ఆ సీన్ ను చిత్రీకరించారట. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే మహేశ్ బాబు, శ్రీలీల మధ్య ఓ మాస్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో మహేశ్, శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరీ లీడ్ రోల్ పోషిస్తోంది. జనవరి 6వ తేదీన హైదరాబాద్లో గ్రాండ్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుందని సినీ వర్గాల్లో టాక్.

Read more RELATED
Recommended to you

Exit mobile version