లోక్ సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు : కేటీఆర్

-

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం ప్రతి పక్షంలోకి మారింది. రాజకీయాల్లో ఎప్పుడూ ఎవ్వరూ పదవులకు శాశ్వతం కాదు అని నిరూపితం అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగో ఓడిపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలనే కసితో ఉంది. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్.

ఈ నేపథ్యంలోనే ఇవాళ పార్లమెంట్ BRS రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. నియోజక వర్గాల వారీగా మీటింగ్ లు ఏర్పాటు చేసుకొని రెడీ అవ్వండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజక వర్గాల్లో మాజీ ఎమ్మెల్యే లే ఇన్ చార్జీలుగా ఉంటారు. జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ లోని నాలుగు నియోజకవర్గాల లో లక్ష తొమ్మధి వేల మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీ నీ కాపాడుకుంటూ.. లోక్ సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలి. బీజేపీ ధీటుగా ఉంటది కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా పోటీ ఇస్తారు. ఓడిపోయామనే  నిరాశ వద్దు..మనం  ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version