కొత్త పాట : చింత‌చెట్టు నీడ‌లో బావ‌కోసం మ‌ర‌ద‌లు విర‌హం

తెలంగాణ‌, తీన్మార్ పాట‌ల్లో ఉండే ఊపు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా చిందేయిస్తాయి. యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ సాంగ్స్‌కి ల‌క్ష‌ల్లో.. అంత‌కు మించి వ్యూస్ రావ‌డం చూస్తూనే ఉన్నాం. ఇక కొత్త‌గా వ‌చ్చిన చింత చెట్టు నీడ‌లో ఓ మ‌ర‌ద‌లు త‌న బావ‌కోసం పాడిన పాట దూసుకుపోతుంది. సాత్విక స్టుడియోస్ అనే కొత్త సంస్థ ఈ పాట‌ను యూట్యూబ్‌లో పెట్టిన రెండు రోజుల్లోనే ల‌క్షల్లో వ్యూస్ సంపాదించి దూసుకుపోతుంది.

సింగ‌ర్ షిరీషా పాట‌కు బాగా ప్ల‌స్ కాగా యువ సంగీత ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ అద‌ర‌గొట్టాడు. బానోతు దేవెంద‌ర్ స‌మ‌కూర్చిన పదాలతో ఈ పాట‌ను మ‌ళ్లీ మ‌ళ్లీ వినేలా చేశాయి.

chintha chettu needa folk song
Writer, Lyricist – Banoth Devender Naik
Programming, Music- Kalyan
Singer – Shirisha
Actress – Shirisha
DOP-Editing – Shiva Velpula
Production – Sathvika Studio
Presented By – Sathvika Studio

యూట్యూబ్ ఛానెల్ పెట్టాల‌నుకునేవారు ఫోక్‌సాంగ్స్ చేస్తే మంచి ఆదాయం వ‌చ్చే అవ‌కాశాలున్నాయి. ఎందుకంటే ఈ పాట‌ల‌కు రీచ్ ఎక్కువ‌, త‌క్కువ టైమ్‌లోనే స‌బ్్స‌స్రైబ‌ర్స్‌ను పొందుచ్చు. వాచ్ టైమ్ కూడా వ‌స్తుంది. యూట్యూబ్‌లో మోనెటైజ్ చెయ్యాలంటే మినిమ‌మ్ 1000 మంది స‌బ్్స‌స్రైబర్లు ఉండాలి లేదా వాచ్ టైమ్ 4000 గంట‌లు ఉండాలి.

ఉద్యోగం చేస్తూ ఇలా సైడ్ బిజినెస్‌గా యూట్యూబ్ ఛానెల్‌ను పెట్టుకోవ‌డం మంచి ఆలోచ‌న‌. ఏదో ఒక‌రోజు ఉద్యోగాన్ని వ‌ద‌లాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఈ చిన్ని బిజినెసే ఆధారం కావ‌చ్చు.. సో ప్ర‌య‌త్నం చెయ్యాలి..