మెగాస్టార్ చిరంజీవి గొప్ప మనసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వారు అనుకుంటే చాలు… ఎంతటివారికైనా ఇంత సహాయమైనా సహాయం చేసేందుకు… ముందు వరుసలో ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా అభిమానులే తన బలం అని చిరంజీవి నమ్ముతారు. ఫ్యాన్స్ పట్ల ఆయన ఎంతో ఆపేక్ష చూపిస్తారు. ఫ్యాన్స్ కు ఎలాంటి కష్టం ఉన్నా… తొందరగా స్పందించి సహాయం చేస్తారు మెగాస్టార్ చిరంజీవి.
అయితే తాజాగా ఓ వీరాభిమాని కుమార్తె పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సహాయం చేశారు. రాజాం కొండలరావు మెగాస్టార్ చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ప్రదర్శిస్తారు. కొండల రావు కుమార్తె నీలవేణికి ఇటీవల పెళ్లి కుదిరింది. ఇక ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి.. తన అభిమానికి సహాయం చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన అభిమాని కుమార్తె పెళ్లి కోసం లక్ష రూపాయలు అందజేశారు మెగాస్టార్ చిరంజీవి. అలాగే ఆ అమ్మాయికి తన ఆశీస్సులు అందజేశారు. అయితే ఈ విషయాన్ని అఖిలభారత చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.