ఆర్ఆర్ఆర్.. వెయిటింగ్ అంటూ చిరంజీవి ట్వీట్

-

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ రానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఉదయం పది గంటకు రిలీజ్ చేస్తామని ప్రకటించగా..ఓ పది పదిహేను నిమిషాలు ఉందనగా.. చిరంజీవి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. చిరు చేసిన ఈ ట్వీట్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. చిరు టైమింగ్‌ను చూసి ముచ్చట పడుతున్నారు.

ఖైదీ నెంబర్ 150 సినిమాలో ఇంటర్వెల్ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. విలన్‌కు వార్నింగ్ ఇచ్చే ఈ సీన్‌కు ఓ రేంజ్‌లో విజిల్స్ పడ్డాయి థియేటర్లో. వెయిటింగ్ అంటూ చిరు చెప్పే డైలాగ్‌ను ఆపై ఎన్నో చిత్రాల్లో వాడేశారు. తాజాగా అదే డైలాగ్‌ను చిరు ట్వీట్ చేస్తూ.. ఆర్ఆర్ఆర్ సర్‌ప్రైజ్ కోసం ఎదురుచూస్తున్నానని వెయిటింగ్ అంటూ ట్వీట్ చేశారు.

మరికాసేపట్లోనే ఆ సర్‌ప్రైజ్ ఏంటో అందరికీ తెలిసిపోనుంది. ఎప్పటికీ ఆ సర్‌ప్రైజ్ మరిచిపోలేవని ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడిగా సీత పాత్రలో అలియా భట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news