GodFather Review: చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ రివ్యూ… బాస్ కమ్ బ్యాక్ ఇచ్చారా?

చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్​కు తెలుగు రిమేక్ ఇది. అప్పట్లో ఈ సినిమాను తెలుగుల కూడా డబ్ చేశారు. అమెజాన్​ ప్రైమ్​లో ఈ సినిమా అందుబాటులో కూడా ఉంది. తెలుగులో డబ్ అయి… ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రిమేక్ చేయడంతో గాడ్​ ఫాదర్​పై అందరికి ఆసక్తి పెరిగింది. మెగాస్టార్ ఈ సినిమాలో ఎలా నటించారనే విషయం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. దానికి తోడు ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు, డైలాగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. అంతే కాకుండా సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషించారు. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా సందర్భంగా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ ఏంటంటే… రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోవడంతో సీఎం సీట్​కు నయనతార, సత్యదేవ్​లు ముందు నిలుస్తారు. పార్టీలో కొన్ని గొడవలు జరగుతుంటాయి. ఈ క్రమంలో ఇవన్నీ బ్రహ్మా (చిరంజీవి) గమనిస్తారు. వాటిని చిరంజీవి ఎలా తన మైండ్ గేమ్​తో ఎత్తుగడలు వేశాడు. తర్వాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎవరు ఎలా చేశారంటే… మలయాళం లూసిఫర్​ కథను అలాగే తీసుకున్నా.. దానికి చాలా మార్పులు చేశారు దర్శకుడు మోహన్ రాజా. సినిమాలో పాత్రలను తీర్చిదిద్దిన విధానం.. చేసిన మార్పులు చాలా వరకు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. మెగాస్టార్ తన రోల్​లో అదరగొట్టేశారు. లుక్స్​ బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ అదిరిపోయాయి. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఆచార్యతో పోల్చితే చాలా ఎనర్టీతో మెగాస్టార్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక నయనతార తన రోల్​కు పూర్తి న్యాయం చేసింది. సత్యదేవ్​ కూడా బాగా నటించాడు. చిరు నమ్మకాన్ని నిలబెట్టారనే చెప్పొచ్చు. ఇక సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్​లో మెప్పించారు. ఆడియెన్స్​కు బాగానే నచ్చుతుంది.

సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్​ విషయంలో తమన్ కుమ్మేశాడు అని చెప్పవచ్చు. ట్రైలర్​లో మ్యూజిక్​ యావరేజ్​గా అనిపించినా.. సినిమాలో అద్భుతంగా అనిపిస్తోంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు అనిపిస్తోంది. ఇక సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మోహన్ రాజా లూసిఫర్​కి చాలా వరకు చేసిన చేంజెస్ అన్నీ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఫస్టాఫ్ వరకు కథ కొంచం రొటీన్​గానే అనిపించినా అక్కడక్కడా వచ్చిన హీరో ఎలివేషన్స్ ఆకట్టుకోగా ఇంటర్వెల్ సీన్ అదిరిపోయి సెకెండ్ ఆఫ్​పై అంచనాలు పెంచుతాయి. ఇక సెకెండ్ ఆఫ్ అక్కడక్కడా కొంచం స్లో అయినా ఫస్టాఫ్ కన్నా బెటర్​గా ఉండి మొత్తం మీద ఆడియన్స్ సంతృప్తితో థియేటర్స్ బయటికి వస్తారు.

ప్లస్ మైనస్ పాయింట్స్.. మొత్తం మీద సినిమాలో మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టేశారని చెప్పవచ్చు. చిరు సల్మాన్​ల క్లైమాక్స్ ఎపిసోడ్, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. సెకండ్ ఆఫ్ చాలా వరకు బాగుంటాయి. ఇక ఫస్టాఫ్ కొంచెం టేక్​ ఆఫ్​కు టైం పట్టడం, కొన్ని ఓవర్​ ది టాప్ యాక్షన్​ సీన్స్​, అక్కడక్కడా లాగ్ అవడం మైనస్. ఓవరాల్​గా సినిమా మంచి ఎక్స్​పిరియన్స్​ను ఇస్తుంది.

చివరగా… ఇక లూసిఫర్​ సినిమా చూడని వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది. మొత్తానికి మెగా అభిమానులకు ఈ సినిమా దసరాకు డబల్ పండగే అని చెప్పొచ్చు. మిగతా వారికి కూడా నచ్చుతుంది.
రేటింగ్: 3/5