ప్రమాణస్వీకార సభా వేదికపై చిరంజీవితో మోదీ ఏం మాట్లాడారంటే?

-

సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో వైరల్‌ అవుతోన్న సంగతి తెలిసిందే. స్టేజ్‌ పై పవన్ వద్దకు వచ్చిన మోదీ చిరు గురించి అడగ్గా పవన్ తన అన్నను మోదీకి పరిచయం చేశారు. అలా చిరంజీవి దగ్గరకు వచ్చిన మోదీ.. మెగా బ్రదర్స్‌ చేతులు పట్టుకొని అభివాదం చేశారు. ఈ సమయంలో ఆయన ఏం మాట్లాడారో తాజాగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

‘నాతో, తమ్ముడితో ప్రధాని నరేంద్ర మోదీ గారు వేదికపై మాట్లాడడం చాలా ఆనందానిచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌ ఇంటికొచ్చినప్పటి వీడియోను ఆయన చూసినట్లు చెప్పారు. కుటుంబసభ్యులు.. ప్రత్యేకించి మా అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమానుబంధాలు ఆ వీడియోలో కనిపించాయన్నారు. ఆ దృశ్యాలు మన సంస్కృతిసంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించాయని అభినందించారు. ఆ క్షణాలు ప్రతి అన్నదమ్ములకి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ప్రధాని మాతో అలా మాట్లాడడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. వారి సునిశిత దృష్టికి నా కృతజ్ఞతలు. తమ్ముడి స్వాగతోత్సవం లాగే మోదీతో జరిగిన మా సంభాషణ కూడా కలకాలం గుర్తుండిపోయే ఓ అపురూప జ్ఞాపకం’ అని చిరు రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news