మరొకసారి తన రేంజ్ నిరూపించుకున్న చిరంజీవి..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్న ఈయన హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించి భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి ఈ సినిమా విడుదల అయి సూపర్ హిట్గా నిలిచి.. ఆయనకు మంచి క్రేజ్ అందించింది. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Godfather: Chiranjeevi made the right choice! - The South First

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసే పనిలో పడింది. అదే సమయంలో నిర్మాతలు కూడా తమ సినిమా బిజినెస్ మొదలుపెట్టారు. ఈ క్రమంలోని ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఏరియాల హక్కులను కూడా తాజాగా ఫ్యాన్సీ రేట్ కి అమ్మినట్లు సమాచారం.

What is Chiranjeevi's Net Worth In 2022?

భోళా శంకర్ సినిమా ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ఏరియాల రైట్స్ ఏకంగా రూ.45 కోట్లకు అమ్ముడుపోయినట్లు.. ఒక్క వైజాగ్ రైట్స్ మాత్రమే రూ. 10 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. ఇకపోతే భోళా శంకర్ సినిమాకు ఒక ఆంధ్ర ప్రదేశ్ లోని రూ.55 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఏది ఏమైనా చిరంజీవి మేనియా మళ్లీ కొనసాగుతోంది అని చెప్పడంలో సందేహం లేదు.