సూర్యాపేటలో లక్ష జనహారతి.. తరలి వస్తున్న ప్రజలు

-

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఈ వేడుకలను కాస్త వినూత్నంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఎడారిగా మారుతుందనుకున్న సూర్యాపేట జిల్లాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను తరలించినందుకు ఇవాళ సాగునీటి దినోత్సవంలో భాగంగా.. లక్ష మందితో హారతులు ఇవ్వనున్నారు. జిల్లాలో కాళేశ్వరం జలాలు పారుతున్న 68 కిలోమీటర్ల మేర లక్ష మందితో జన హారతి ఇవ్వనున్నారు. దీనికోసం రైతులు, మహిళలు, పెద్దలు, పిల్లలు సిద్ధమయ్యారు. కాళేశ్వరం కాలువల వెంబడి వంటావార్పు నిర్వహించనున్నారు. దీంతో నాగారం, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట రూరల్, ఆత్మకూర్ ఎస్, చివ్వేంల,పెన్ పహాడ్, మోతె మండలాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news