తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు?

-

తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు? అంటూ షర్మిలా ఫైర్ అయ్యారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..! కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన దొర.. సర్కారీ భూములను సైతం వదలడం లేదంటూ మండిపడ్డారు.
ఏదో ఒక పేరు చెప్పి కారు చౌకకే భూములు కాజేస్తున్నాడని… భారత్ భవన్ అట,15 అంతస్తులట. ఎక్స్ లెన్స్ సెంటర్ పెడతాడట.

ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి రెండు కార్యాలయాలా..? అని మండిపడ్డారు. పార్టీ పేరు మార్చినంత మాత్రాన.. కొత్త భవనానికి సర్కారు భూమి ఇవ్వడమా..? రూ.550కోట్లు పలికే 11 ఎకరాల స్థలం రూ.37కోట్లకే కొట్టేయడమా.? అని నిలదీశారు షర్మిల. దొర రాజకీయాలకు అగ్గువకే దొరికే సర్కారీ భూములు పేదల సంక్షేమానికి మాత్రం కనపడవు… దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి భూములు ఉండవన్నారు. 36 లక్షల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడానికి భూములు దొరకవు… అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు భూములు ఉండవని వెల్లడించారు.
చివరికి జర్నలిస్టులకు ఇవ్వడానికి స్థలాలు దొరకవు… కానీ దొర విలాసాలకు, పార్టీ కార్యాలయాలకు, ఎక్స్ లెన్స్ సెంటర్లకు మాత్రం అడగంగనే భూములు దొరుకుతయంటూ అగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news