ప్రభుత్వ ప్రతిపాదనపై.. ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కు చిరంజీవి రిక్వెస్ట్

-

తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తూ ‘గద్దర్‌ అవార్డ్స్‌’ పేరిట పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్ను కోరారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ఈ విషయమై దృష్టి సారించాలని ఎక్స్‌ వేదికగా కోరారు.

తాజాగా రవీంద్రభారతిలో నిర్వహించిన డా.సి.నారాయణరెడ్డి 93వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌ రెడ్డి  ‘గద్దర్‌’ పేరిట అవార్డులు ఇస్తామని ప్రకటించినా చిత్ర పరిశ్రమ తమని సంప్రదించలేదన్నారు. ఇప్పటికైనా సినీ ప్రముఖులు ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తే తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుంది’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ఎక్స్‌ వేదికగా ఈ విషయంపై స్పందిస్తూ ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ను ఈ విషయంపై దృష్టి సారించాలని రిక్వెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version