సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో పని చేసే డాక్టర్లు చాలా వరకు సిన్సీయారిటీగా విధులను నిర్వహిస్తుంటారు. కొంత మంది మాత్రం లంచాలకు పాల్పుడుతూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వైద్య వృత్తిలో అయితే డాక్టర్లు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో సేవ చేస్తుంటారు. అందులో కూడా కొంత మంది డాక్టర్లు ఓవైపు ప్రభుత్వ డాక్టర్ గా విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు కార్పొరేట్ ఆసుపత్రులను నడిపిస్తుంటారు. ఇలా చాలా మంది డాక్టర్లు ఇదే ఫాలో అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. కొత్తగూడం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు వేధింపులకు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వ డాక్టర్ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, కొత్తగూడెం మాజీ కలెక్టర్ ప్రియాంక, కొత్తగూడెం మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఆర్ఎల్ లక్ష్మణరావు, కొత్తగూడెం సహారా ఏజెన్సీ వాళ్ల వేధింపుల వల్ల కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ సూపరిండెంట్ బొడ్డ కుమారస్వామి ఆత్మహత్య చేసుకున్నాడని.. తన భర్త ఆత్మహత్యకు వీరే కారణమని, వీరిపై చర్యలు తీసుకోవాలని కుమారస్వామి భార్య ఆవేదన తెలిపింది.
సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు వేధింపులకు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వ డాక్టర్ భార్య ఆవేదన.
కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, కొత్తగూడెం మాజీ కలెక్టర్ ప్రియాంక, కొత్తగూడెం మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఆర్ఎల్ లక్ష్మణరావు, కొత్తగూడెం సహారా ఏజెన్సీ వాళ్ల వేధింపుల వల్ల… pic.twitter.com/3xWDkQt5dO
— Telugu Scribe (@TeluguScribe) July 31, 2024