Video : వయనాడ్ విషాదం.. బురదలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన రెస్క్యూ టీమ్

-

ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళ వయనాడ్‌ జిల్లాలోని వర్ష బాధిత గ్రామాల్లో విలయం తాండవిస్తోంది. బురదలో చిక్కుకున్న వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోతోంది. సహాయక చర్యలు ముమ్మరం చేసిన రెస్క్యూ టీమ్స్ బాధితులను కాపాడుతున్నారు. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం తెల్లవారుజామున అక్కడ కొండచరియలు విరిగిపడి బురద ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకుపోయారు. వారు తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని విలపించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

మరోవైపు వయనాడ్ కొండచరియలు బీభత్సం సృష్టించగా ఓ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నడుము లోతు బురదలో చిక్కుకుని 5 గంటలపాటు విలవిలలాడాడు. కాపాడమంటూ ఆర్తనాదాలు చేశాడు. చివరికి రెస్క్యూ సిబ్బంది అతడిని రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఐదు గంటలు అతడు అనుభవించిన నరకం గురించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. బ్రేవ్ పర్సన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వయనాడ్ విలయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొండచరియలు విరిగిపడిన ఘటనలో 143 మంది మరణించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version