మెహబూబ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన చిరు …!?

-

బిగ్ బాస్ గత సీజన్‌లో ఉన్న వాళ్లకి పెద్ద ఆఫర్స్ వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ సీజన్‌లో ఇప్పటికే సోహైల్‌ ..ఫస్ట్ గా ఆఫర్‌ కొట్టేశాడు. హీరోగా ఓ సినిమాని ప్రకటించాడు. ఇక మోనాల్‌ `స్టార్‌మా` డాన్స్ ప్లస్‌లో జడ్జ్ గా ఆఫర్‌ కొట్టేసింది. బిగ్‌బాస్4 విన్నర్‌ అభిజిత్‌కి పలు ఆఫర్స్ ఉన్నాయి. యితే ఇప్పుడు మెహబూబ్‌ జాక్‌పాట్‌ కొట్టేసినట్టు తెలుస్తుంది.ఏకంగా మెగాస్టార్‌ స్వయంగా ఆఫర్‌ ఇచ్చిన సమాచారం.

కొత్త వారిని ప్రోత్స‌హించ‌డంలో మెగాస్టార్ చిరంజీవి ముందుటారు. త‌న కెరీర్ ప్రారంభం నుంచేఆయ‌న ఎంతో మంది కొత్త ద‌ర్శ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు, న‌టీన‌టుల‌ను ఆయ‌న ప్రోత్స‌హిస్తూ వ‌చ్చారు. అలా చిరు ప్రోత్స‌హించిన వారిలో ర‌వితేజ‌, సునీల్, రాఘ‌వ లారెన్స్ ఇలా చాలా మందే ఉన్నారు. కాగా ఇటీవ‌ల కాలంలోనూ చిరు ప‌లువురికి ఆఫ‌ర్లు ఇస్తున్నారు.బిగ్‌బాస్‌తో చాలా మందికి పాపులారిటీ వస్తుంది. నాలుగు సీజన్లలో అనేక మంది కంటెస్టెంట్లు ఫ్యామిలీ ఆడియెన్స్ లో నోట్లో నాలుకలా మారారు. బిగ్‌బాస్‌ 4 కంటెస్టెంట్లకి ఇంకా మరింత గుర్తింపు దక్కింది. కారణంగా థియేటర్లు లేకపోవడం, సోషల్‌ మీడియా బాగా పెరగడం, ఉన్న ప్రధాన మాధ్యమం టీవీ కావడంతో అంతా బిగ్ బాస్ ని తిలకించారు. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు హౌజ్‌లో జరిగిన విషయాలపై చర్చ జరగడం కంటెస్టెంట్లకి గుర్తింపు తెచ్చింది. అంతేకాదు ఇప్పుడు అవకాశాలను తీసుకొస్తున్నారు. .సొహైల్ హీరోగా చేస్తే అందులో తాను కెమెరా అప్పియ‌రెన్స్ ఇస్తాన‌ని చెప్పిన చిరు.. దివికి త‌న వేదాలం రీమేక్‌లో ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పారు. దాని టెస్ట్ క‌ట్ త్వ‌ర‌లో ఉండొచ్చ‌ని తెలిపారు.

ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సీజ‌న్ బిగ్‌బాస్‌లో పాల్గొన్న మ‌రో కంటెస్టెంట్‌కి చిరు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది…ప్ర‌స్తుతం చిరంజీవి, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఫిలింన‌గ‌ర్ వర్గాల స‌మాచారం ప్రకారం.. ఆచార్య‌లో బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ మెహ‌బూబ్‌కి ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు మెహ‌బూబ్‌కి ఓ పాత్ర ఇవ్వాల‌ని కొర‌టాల‌కు సూచించార‌ట చిరు. అందుకు కొర‌టాల కూడా ఒప్పుకున్న‌ట్లు టాక్. బిగ్‌బాస్‌ స్టేజ్ మీద మెహ‌బూబ్‌ డ్యాన్స్‌ల‌పై చిరు ప్రశంస‌లు కురిపించ‌డంతో పాటు ప‌ది ల‌క్ష‌ల‌ను ఇచ్చారు. తాజాగా ఇప్పుడు ఓ ఆఫ‌ర్‌ని కూడా ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news