మానవ శరీరంలో అతిముఖ్య భాగమైన గుండె ఎక్కడుంది అంటే టక్కున ఎడమ వైపు అని చెప్పేస్తారు. కానీ.. ఓ మహిళకు మాత్రం ఆమె తన భూజానికి వెసుకునే బ్యాగులో గుండె ఉంటుంది. ఇదేంటి బ్యాగులో గుండె ఉండటం ఏంటని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది మాత్రం వాస్తవం ఆమె ఎక్కడికి వెళ్లినా తన బ్యాగును వెంట తీసుకెళ్లాల్సిందే. శరీరంలోని అన్ని అవయవాల మాదిరిగానే ఆమె బ్యాగ్ కూడా ఓ అవయవంగా మారిపోయింది. లండన్‌కు చెందిన సెల్వా హుస్సెన్ (42), భర్త ఏఐ, వీరికి ఇద్దరు సంతానం. ఓసారి ఆమె కారులో ప్రయాణించేటప్పుడు గుండెలో తీవ్రమైన నొప్పి రావడంతో తన ఫ్యామిలీ డాక్టర్‌నను సంప్రదించింది. ఆమెకు పలు పరీక్షలు చేయగా ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ఆమె హార్ట్ ఫేల్యూర్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఆస్పత్రిలో భర్త అంగీకరంతో ఆమె గుండెను తొలగించి కృతిమ గుండెను తయారు చేసి ఓ బ్యాగులో అమర్చారు.
రెండు బ్యాటరీలు, ఓ పంపుతో..
అందులో రెండు బ్యాటరీలు, ఓ పంపు మోటర్ ఉంటాయి. దాని నుంచి రెండు పైపులు ఆమె శరీర భాగంలోంచి లోపలికి వెళ్తాయి. బ్యాగులో ఉన్న మోటర్ల సహాయంతో శరీరంలో ఉన రెండు బెలూన్లకు నిరంతరంగా గాలిని పంపు చేస్తుండాలి. ఆ రెండు బెలూన్లు గుండె చాంబర్లుగా పని చేస్తాయి. తద్వారా రక్తం శరీరంలోని మిగతా భాగాలకు సరఫరా అవుతుంది. ఈ గుండె నిమిషానికి 138 సార్లు కొట్టుకునేలా సెట్ చేశారు. బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే 90 సెకన్లలోనే మార్చేయాలి లేదంటే ప్రాణాలు పోయే అవకాశం ఉందని వైద్యులు ముందు సూచించారు.
రూ. 78 లక్షలతో..
ఈ కృతిమ గుండెకు రూ.86 వేల యూరోలు అంటే మన కరెన్సీలో రూ. 78 లక్షలు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన హైఫిల్డ్ ఆస్పత్రిలో సాల్వా హుస్సెన్‌కు గుండె అమర్చారు. ఆమె గుండె బ్యాగులో ఉండటంతో అందుకే ఆమె ఎక్కడికి వెళ్లినా కన్న బిడ్డలాగా బ్యాగును తీసుకు వెళ్తుంది.