ముద్దొచ్చే పెట్టా అయితే ఏంటి..?

-

రీసెంట్ గా జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ కవచం టీజర్ రిలీజ్ ఈవెంట్ లో కెమెరా మెన్ చోటా కె నాయుడు కాజల్ ను స్టేజ్ మీద ముద్దు పెట్టడం సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తుంది. తమన్ తో బెట్ కట్టి మరి కాజల్ కు కిస్ పెట్టాడు చోటా నాయుడు. ఎప్పుడు ఏ మ్యాటర్ దొరుకుతుందా ఆడేసుకుందాం అనుకునే సోషల్ మీడియాకు మంచి పని పెట్టాడు చోటా భయ్యా.

అతను ప్రతి ఈవెంట్ లో చేసిన వెకిలి వేశాలన్నిటిని చూపిస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. అయినా సరే కాజల్ ను ముద్దాడిన విషయంలో తనని తాను సమర్ధించుకుంటున్నారు చోటా కె నాయుడు. తనకు సౌందర్య తర్వాత కాజల్ అంటేనే ఇష్టం, అభిమానమని ఆ అభిమానం కొద్ది ముద్దు పెట్టానే తప్ప తానేమి తప్పుడు ఉద్దేశంతో ముద్దు పెట్టలేదని చెప్పుకొచ్చాడు. మరి అభిమానం అంటూ ముద్దులు పెట్టుకుంటే ఆ హీరోయిన్స్ కు ఎంత బ్యాడ్ నేం అన్నది ఆలోచించ లేదనుకుంటా చోటా కె నాయుడు.

ఇదిలాఉంటే ఈ విషయంపై కాజల్ మాత్రం స్పందించడం లేదు. ముద్దు పెట్టిన టైంలోనే చోటా తన ఫ్యామిలీ మెంబర్ అంటూ ఏదో కవర్ చేసినా వ్యవహారం ఇంత వేడెక్కుతుందని భావించలేదు అనుకుంటా అందుకే అమ్మడు సైలెంట్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version