నంద‌మూరి వార‌సుడి ఎంట్రీ లేనట్లేనా…? సస్పెన్స్ వీడిన‌ట్టేనా…?

-

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనేది ఇప్పటివరకు సస్పెన్స్‌..  మోక్ష‌జ్ఞ‌కు సినిమాలంటే ఇష్టం లేద‌ని… అత‌డు బిజినెస్‌లో రాణించాల‌న్న ల‌క్ష్యంతో.. ఉన్నట్లు వచ్చిన వార్తలు వాస్తవాలా..?

నందమూరి మూడో తరం వారసుడు యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు….  మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని  తెలుగు సినిమా అభిమానులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలోనే పులోమావి పాత్ర‌లో మోక్ష‌జ్ఞ క‌నిపిస్తాడ‌న్న వార్త‌లు వ‌చ్చాయి.

శాత‌క‌ర్ణి వ‌చ్చింది.. ఆ త‌ర్వాత కూడా బాల‌య్య మ‌రో ఐదు సినిమాలు చేసేశాడు. మ‌రో రెండు సినిమాల‌ను లైన్లో పెట్టేశాడు. మ‌రి ఈ టైంలో ఇంకా మోక్ష‌జ్ఞ ఎంట్రీపై ఇంత స‌స్పెన్స్ ఎందుకో ? నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌లేదు. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన మోక్షు లుక్స్ చూశాక చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు.

చాలా లావుగా.. బొద్దుగా మారిపోయాడు. దీంతో చాలా మంది మోక్ష‌జ్ఞ‌కు సినిమాలంటే ఇష్టం లేద‌ని… అత‌డు బిజినెస్‌లో రాణించాల‌న్న ల‌క్ష్యంతో ఉంటున్నాడ‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇటు మోక్షు సినిమాల గురించి ఎలాంటి ఉలుకు ప‌లుకు లేక‌పోవ‌డం కూడా మోక్షు సినిమాల్లోకి రాడ‌నే అంద‌రూ అనుకున్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం మోక్షు సినిమాల‌కు సంబంధించిన కోర్సులు నేర్చుకుంటున్నాడ‌ట‌.

అటు డ్యాన్సులు, ఫైట్ల‌లోనూ శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ట‌. మోక్షు సినిమా ఎంట్రీ ఉన్నా ఇప్ప‌టికిప్పుడు అయితే ఉండ‌ద‌నే అంటున్నారు. ఈ విష‌యాన్ని నంద‌మూరి కాంపౌండ్‌కు స‌న్నిహితంగా ఉన్న వాళ్లే చెపుతోన్న మాట‌. దీనిని బ‌ట్టి చూస్తే మోక్షు సినిమాల్లోకి వ‌చ్చేందుకు మ‌రి కాస్త స‌మ‌యం ఉంద‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది. మోక్షును వెండితెర‌పై చూడాల‌నుకునే వారికి ఈ స‌స్పెన్స్ మ‌రి కొన్ని రోజులు త‌ప్ప‌దు.

Read more RELATED
Recommended to you

Latest news