ఘనంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం.. కేసీఆర్ సహా రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు

-

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం రోజున రాత్రి హైదరాబాద్​లో ఘనంగా జరిగింది. నగరానికి చెందిన డాక్టర్‌ పద్మజా వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో సిద్ధార్థ ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్స్‌ ఈ వేడుకకు వేదికైంది. ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రామ్‌చరణ్‌, మోహన్‌ బాబు, ఎల్బీ శ్రీరామ్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్ప గుచ్ఛం అందజేసి వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం బ్రహ్మానందం దంపతులతో కాసేపు ముచ్చటించారు. మరోవైపు వెంకయ్య నాయుడు కూడా నూతన దంపతులకు తన ఆశీర్వచనాలు అందించి.. బ్రహ్మానందంతో కాసేపు ముచ్చటించారు. ఇక సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news