తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు.. ఆ జిల్లా కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు

-

పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చిన వరణుడు మరోసారి తెలంగాణను వణికించేందుకు వచ్చేశాడు. శుక్రవారం రోజున రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇక ఇవాళ తెల్లవారు జాము నుంచి కూడా వర్షం కురుస్తోంది. ఉదయాన్నే పనులపై బయటకు వెళ్లాలనుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు.

వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. రెండు, మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లే అవకాశముంది. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజులపాటు ఆదిలాబాద్‌, కుమురంభీమ్‌-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రత్తమైంది. సీఎస్‌ శాంతికుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news