బాహుబ‌లి -3 పై జ‌క్క‌న్న క్రేజీ అనౌన్స్ మెంట్.. ఖుషీ లో డార్లింగ్ ఫ్యాన్స్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో వ‌చ్చిన బాహుబ‌లి సినిమా తో యావత్ ప్ర‌పంచం టాలీవుడ్ వైపు చూసింది. అంతే కాకుండా ప్ర‌భాస్ ను పాన్ ఇండియా స్టార్, పాన్ వ‌రల్డ్ స్టార్ గా చేసిన సినిమా కూడా బాహుబ‌లి యే అనడంలో ఎలాంటి సందేహం లేదు. క‌లెక్ష‌న్ ల ప‌రంగా కూడా ప్ర‌పంచ సినీ ప‌రిశ్ర‌మనే త‌ల‌ద‌న్నేల మొద‌టి స్థానంలో ఉంది. అయితే బాహుబ‌లి సినిమా ను రెండు భాగాలుగా తీసిన విష‌యం తెలిసిందే.

మొద‌టి పార్ట్ క‌న్నా.. రెండో పార్ట్ ఎన్నో రికార్డుల‌ను సృష్టించింది. అయితే బాహుబ‌లి – 3 ఇప్ప‌టి వ‌ర‌కు చాలా రూమ‌ర్స్ వ‌చ్చాయి. అలాగే ప్ర‌భాస్ అభిమానులు కూడా బాహుబ‌లి – 3 ని తెర‌కెక్కించాల‌ని రాజమౌళికి అనేక సార్లు కోరారు. అయితే డైరెక్ట‌ర్ రాజ‌మౌళి బాహుబ‌లి – 3 పై ఎలాంటి కామెంట్స్ చేయ‌లేదు. అయితే తాజా గా రాజ‌మౌళి బాహుబ‌లి మూడో పార్ట్ పై క్రేజీ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కాక‌పోయినా.. భ‌విష్య‌త్తు లో బాహుబ‌లి – 3 త‌ప్ప‌క ప్లాన్ చేస్తాన‌ని రాజ‌మౌళి ప్ర‌క‌టించారు.

 

అయితే ఎప్పుడు వ‌స్తుంద‌నే విష‌యం పై ఇప్పుడు చెప్పలేనని అన్నారు. కానీ త‌ప్ప‌క బాహుబ‌లి – 3 ఉంటుంద‌ని తెలిపారు. అయితే బాహుబ‌లి సృష్టి క‌ర్త నుంచే మూడో పార్ట్ పై అనౌన్స్ మెంట్ ఇవ్వ‌డం తో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఖుషీ లో ఉన్నారు. కాగ రాజ‌మౌళి ఈగ సిక్వెల్ ను కూడా తెర‌కెక్కించడానికి సిద్ధం గా ఉన్నాన‌ని కూడా ప్ర‌క‌టించారు.