PUSHPA REVIEW : “పుష్ప” రివ్యూ

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాలో.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి.. వచ్చిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో ఇవాళ థియేటర్లలో విడుదలైంది పుష్ప. పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కోసం ఎగబడుతున్నారు జనాలు.

కథాంశం :

రాయలసీమ లోని శేషాచలం కొండల్లో ఎర్రచందనం మొక్కలు కొట్టే కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప.. అతి తక్కువ సమయంలో తన తెగువతో తెలివితేటలతో స్మగ్లింగ్ సామ్రాజ్యంలో కీలకమైన వ్యక్తి గా ఎదుగుతాడు. ఈ నేపథ్యంలో అతని అడ్డుపెట్టుకొని కోట్లు గడించిన కొండారెడ్డి (అజయ్ ఘోష్), అతని తమ్ముళ్ళకు ఎలా చుక్కలు చూపించాడు ? ఎర్రచందనం సిండికేట్ లీడర్ గా చక్రం తిప్పే మంగళం సీను (సునీల్) కుక్క పక్కలో బల్లెంలా ఎలా మారాడు ? చిన్నప్పుడే ఇంటిపేరు కోల్పోయిన తనను ఆ కారణంతో అవమానించే వారికి ఎలా బుద్ధి చెప్పాడు ? అనేది ఇందులోని కథాంశం.

అలాగే ఈ సినిమాలో సుకుమార్ మదర్ సెంటిమెంట్, లవ్ యాంగిల్ ను మిక్స్ చేశాడు. మధ్యమధ్యలో ఉద్వేగభరిత సంఘటనలను… పెట్టి ప్రేక్షకులను అలరించాడు సుకుమార్. అటు పాలు అమ్ముకునే దిగువ మధ్య తరగతి అమ్మాయి శ్రీవల్లి పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. బందీగా ఉన్న తండ్రి రక్షించుకోవడానికి జాలి రెడ్డి దగ్గరకు వెళ్లే ముందు పుష్పా ను కలిసి.. తన ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశం మూవీకి హైలెట్గా నిలిచింది. అటు ఈ ఈ సినిమాకు డిఎస్పి మ్యూజిక్ చాలా హైలెట్ గా నిలిచింది. ఎర్రచందనం స్మగ్లర్ కొండారెడ్డి గా అజయ్ ఘోష్, అతని తమ్ముడు జాలి రెడ్డి గా కన్నడ నటుడు ధనుంజయ్ చక్కగా నటించారు.

ఈ మూవీలో స్పెషల్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ అంటే సునీల్ పోషించిన మంగళం శ్రీను పాత్ర. కమెడియన్ గా తనకున్న ఇమేజ్ను పూర్తిగా తుడిచేసి కొత్త రకం అవతారమెత్తాడు సునీల్. ఇక అనసూయ విషయానికి వస్తే రంగస్థలం సినిమా లో కంటే ఈ సినిమాలో ఆమెకు పెద్దగా పేరు రాలేదు. ఇక అటు సమంత ఐటమ్ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ గా నిలిచింది. సమంత ఐటమ్ సాంగ్ రాగానే అందరికీ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసే.. ఫాహద్.. ఈ సినిమాలో తేలిపోయాడు. క్లైమాక్స్కు కాస్తంత ముందు భన్వర్ సింగ్ షెకావత్ గా తెరపైకి వచ్చి కొంత నిరాశకు గురి చేశాడు. అయితే రెండో పార్ట్ లో అతని పాత్ర చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఓవరాల్ గా చూసినప్పుడు మరీ ముఖ్యంగా క్లైమాక్స్ కి వచ్చేసరికి మూవీ గ్రాఫ్ కొద్దిగా డౌన్ అయిన భావన కలుగుతుంది. అయితే సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్

అల్లు అర్జున్ యాక్టింగ్
సమంత ఐటమ్ సాంగ్
ఆర్టిస్టుల మేక్ఓవర్
కథాంశం.

మైనస్ పాయింట్స్

బలహీనమైన క్లైమాక్స్
మూవీ రన్ టైం
పాత్రల మిస్సింగ్

రేటింగ్ -3.5/5