రామ్ కొ..ణి..ద..ల.. బాక్సాఫీస్ పై మెగా దండయాత్ర

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం సినిమాతో సూపర్ ఫాంలోకి వచ్చాడు. చిట్టిబాబు దెబ్బకు ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులన్ని తుడిచిపెట్టుకుపోయాయి. ఇక ఆ సినిమా తర్వాత రాబోతున్న వినయ విధేయ రామ కూడా చరణ్ దమ్ము చూపించడం ఖాయమని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. బోయపాటి మార్క్ గా వస్తున్న వివిఆర్ మూవీ సంక్రాంతికి మెగా సంబరం తెస్తుందని ఆశిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటుగా ఈమధ్యనే ఆర్.ఆర్.ఆర్ మొదలుపెట్టాడు చరణ్. ఎన్.టి.ఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఈ మూవీపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మల్టీస్టారర్ తర్వాత రాం చరణ్ కొరటాల శివతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం చిరంజీవి సైరా తర్వాత కొరటాల శివ సినిమా లైన్ లో పెట్టాడు. ఆ సినిమా తర్వాత కొరటాల శివ చరణ్ తో సినిమా చేస్తాడట.

వినయ విధేయ రామ, ఆర్.ఆర్.ఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమా.. రాం చరణ్ సినిమాల లెక్క చూస్తే దిమ్మతిరిగిపోతుంది. చూస్తుంటే చెర్రి బాక్సాఫీస్ బాద్షాగా మారేందుకు పర్ఫెక్ట్ స్కెచ్ వేశాడని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news