ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ అప్ డేట్.. పవన్ లుక్ అదుర్స్

-

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. 2023లో ప్రారంభమైన ఈ మూవీ కూడా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్లడం ద్వారా షూటింగ్ పోస్ట్ ఫోన్ అవుతూ వస్తుంది. 2016లో విడుదలైన తమిళ్ సినిమా తేదీ ఆధారంగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హరీష్ శంకర్ దశకత్వం వహించారు.

ఇందులో పవన్ కళ్యాణ్, శ్రీ లీల, సాక్షి, వైద్య అశుతోష్, రాణా కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ ను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ షూటింగ్ క్రేజీ క్లైమాక్స్ ఎపిసోడ్ పవన్ పై రూపొందించినట్లు, సీన్లతో కంప్లీట్ అయినట్లు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. భావోద్వేగమైన యాక్షన్ తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ తో ముగిసింది అని తెలిపారు. ఈ పోస్ట్ లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news