తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తాల్సి ఉంది. ఇవాళ ఉదయం 10గంటలకే క్రస్ట్ గేట్లు ఎత్తుతామని ప్రకటించారు. అయితే తొలుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బేగంపేట ఎయర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలస్యంగా రావడంతో సినిమాటో గ్రఫీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
చాలా సేపటి వరకు బేగంపేట ఎయిర్ ఫోర్టులో వెయిట్ చేసిన వెంకట్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ ఆలస్యంగా రావడంతో అలిగి వెళ్లారు. దీంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లా ఇన్ చార్జీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు బయలుదేరారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేందుకు హాజరు కాకపోవడం గమనార్హం. ఇలాంటి సంఘటనలు కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం నుంచే చోటు చేసుకోవడం విశేషం.