ఏపీ కానిస్టేబుల్ అభ్యుర్థులకు బిగ్ అలర్ట్ అనే చెప్పాలి. వాస్తవానికి ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు సచివాలయంలో ఉదయం 11 గంటలకు హోం మంత్రి వంగలపూడి అనిత విడుదల చేయాల్సి ఉంది. అయితే, తుది జాబితాను బోర్డు మరోసారి పరిశీలించనున్న నేపథ్యంలో ఫలితాల విడుదలను రేపటికి వాయిదా వేశారు. రేపు సరిగ్గా ఉదయం 11 గంటలకు సచివాలయంలోనే హోం మత్రి అనిత ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు వెల్లడించారు.
కాగా కానిస్టేబుల్ పరీక్షను 2022 అక్టోబర్ లో నిర్వహించిన విషయం తెలిసిందే. న్యాయ వివాదాల కారణంగా తుది రిజల్ట్స్ అనౌన్స్ చేయలేకపోయారు. ఇప్పటికే రెండు వారాల క్రితం అభ్యర్థులకు ర్యాంక్ కార్డులను కూడా విడుదల చేసిన విషయం విధితమే. కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదలవుతాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినా నిరుద్యోగులు కాస్త నిరాశలో ఉన్నారు. రేపు విడుదల చేస్తామనడం రేపటి వరకు కాస్త ఆందోళనగా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.