ఆర్ఆర్ఆర్ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..!

-

అంతర్జాతీయంగా అవార్డులు అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అరుదైన పురస్కారం దక్కింది. ఈ విషయం తెలిసి అభిమానుల ఆనందానికి అవధులు లేవు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ను తాజాగా ఈ సినిమా సొంతం చేసుకుంది.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సొంతం చేసుకోవడం నిజంగా ఈ సినిమాకు ఆస్కార్ వచ్చినంత సంతోషాన్ని కలిగిస్తోంది.

సోమవారం రాత్రి ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ 2023 అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఫిలిం అఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకోవడం గమనార్హం. వీటితోపాటు కన్నడ చిత్ర సీమ నుంచి చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం అందుకున్న కాంతారా సినిమాకు కూడా అవార్డు లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటనకు గాను మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును దక్కించుకున్నారు రిషన్ శెట్టి.

ముఖ్యంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉత్తమ దర్శకుడు బెస్ట్ యాక్టర్ , వర్సటైల్ యాక్టర్ ఇలా పలు విభాగాలను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించినట్లు తెలుస్తోంది. అలాగే టెలివిజన్ , ఓటిటి వంటి విభాగాలలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందించారు. మొత్తానికైతే ఆర్ఆర్ సినిమా ఇలా వరుసగా అవార్డులను సొంతం చేసుకుంటూ ఆస్కార్బరిలో నిలవడం నిజంగా సంతోషకరంగా ఉంది అంటూ అభిమానులు రాజమౌళి పై అటు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news