రెడ్ కార్పెట్ అనగానే మనకు గుర్తొచ్చేది కలర్‌ఫుల్ ఔట్ఫిట్స్లో హంసనడకలతో నడిచొచ్చే హీరోయిన్లు.. డ్యాషింగ్ డ్రెస్సులో వచ్చే స్టైలిష్ హీరోలు. తాజాగా ముంబయి వేదికగా జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల వేడుకలో రెడ్ కార్పెట్‌పై కూడా ఈ డ్యాషింగ్ హీరోస్.. బ్యూటీఫుల్ హీరోయిన్లు సందడి చేశారు.
కలర్‌ఫుల్ ఔట్ఫిట్స్లో.. కాన్ఫిడెంట్ వాక్‌లో రెడ్ కార్పెట్‌పై తారలు దిగివచ్చారు. ముంబయిలో సోమవారం రాత్రి.. ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ సినీ తారలు విచ్చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారలందరూ అదిరిపోయే స్టైలిష్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు.
రేఖ, ఆలియా భట్, విద్యాబాలన్, అనుపమ్ ఖేర్, మనీశ్ పాల్, ఆర్ బల్కి, వరుణ్ ధావన్, రోనిత్ రాయ్, శ్రేయా తల్పాడే, ఆర్.బాల్కి, షాహిల్ ఖాన్, నటాలియా, జయంతిలాల్ గడ, సాచిత్, పరంపర, వివేక్ అగ్నిహోత్రి, రిషబ్ శెట్టి, హరిహరన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.