అరెరె.. రానా పటాస్ మిస్సయ్యాడా..?

-

అనీల్ రావిపుడి డైరక్షన్ లో నందమూరి కళ్యాణ్ రాం హీరోగా వచ్చిన సినిమా పటాస్. కళ్యాణ్ రాం కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమా అదే. ఇంకా చెప్పాలంటే అతనొక్కడే సినిమా తర్వాత కళ్యాణ్ రాం సత్తా ఏంటో చూపించిన సినిమా కూడా పటాసే. అనీల్ రావిపుడి మొదటి సినిమా అయినా చాలా క్లవర్ గా తీశాడు. కొన్ని సినిమాలకు రచయితగా పనిచేసిన అనీల్ రావిపుడి పటాస్ తో హిట్ అందుకున్నాడు.

ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్ కూడా అనీల్ సక్సెస్ మేనియాను కొనసాగించేలా చేశాయి. దర్శకుడిగా తనకో క్రేజ్ తెచ్చుకున్న అనీల్ రావిపుడి ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ఎఫ్-2 సినిమా చేస్తున్నాడు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే క్యాప్షన్ తో ఈ సినిమా వస్తుంది. చూస్తుంటే ఎఫ్-2తో కూడా అనీల్ రావిపుడి హిట్ కొట్టేలా ఉన్నాడు. అనీల్ రావిపుడి మొదటి సినిమా పటాస్ రానా ఛాన్స్ మిస్సయ్యాడట.

ముందు ఈ కథను రానా కోసమే రాసుకున్నాడట అనీల్ రావిపుడి. కథా చర్చలు కూడా జరిగాయట. ఇక అంతా ఓకే అనుకుంటున్న టైంలో రానాకు బాహుబలి ఆఫర్ రావడం అనుకున్న డేట్స్ కన్నా ఎక్కువ దానికే కేటాయించడం జరిగిందట. లేదంటే పటాస్ సినిమా రానా ఎకౌంట్లో పడేది. పటాస్ హిట్ తర్వాత కళ్యాణ్ రాం కు మరో హిట్ దక్కలేదు. ఒకవేళ రానా పటాస్ చేసుంటే అతని ఖాతాలో ఓ సాలిడ్ హిట్ ఉండేది.

Read more RELATED
Recommended to you

Latest news