రామ్‌చ‌ర‌ణ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన వార్న‌ర్‌.. వీడియో వైర‌ల్‌!

-

ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెన‌ర్ అయిన డేవిడ్‌ వార్నర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఆయ‌న గ్రౌండ్‌లో ఉంటే సిక్సుల మోత మోగాల్సిందే. ఇక ఈయ‌న ఐపీఎల్‌లో హైద‌రాబాద్ త‌ర‌ఫున కెప్టెన్‌గా ఇప్ప‌టికే ట్రోఫీని కూడా అందించాడు. ఇదే క్ర‌మంలో వార్న‌ర్ తెలుగు ప్రేక్షకులను నిత్యం త‌న వీడియోల‌తో అలరించ‌డం అంటే ఎంతో ఇష్టం.

Another Jersey for Ram Charan Gautham Tinnanuri movie Confirmed

ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే చాలామంది తెలుగు హీరోల‌ మూవీల‌కు సంబంధించిన వీడియోలకు తన ముఖాన్ని స్వాపింగ్ చేసి అద‌ర‌గొడుతున్నాడు. ఇప్ప‌టికే టాలీవుడ్ స్టార్ హీరోలైన డార్లింగ్ ప్రభాస్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, బ‌న్నీల పాట‌ల‌కు కూడా స్టెప్పులు వేసి అద‌ర‌గొట్టాడు.

ఇక ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. రామ్‌చరణ్‌ తేజ్ న‌టించిన వినయ విధేయ రామ సినిమాలోని క్లైమాక్స్ ఫైటింగ్ సీన్‌కు తన ఫేస్‌ను స్వాపింగ్ చేసిన వార్న‌ర్ అచ్చం రామ్ చ‌ర‌ణ్‌లాగే ఉన్న‌ట్టు క్రియేట్ చేశాడు. ఇక ఆ వీడియోను శనివారం త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో వార్న‌ర్ పోస్ట్ చేయ‌డంతో విప‌రీతంగా లైకులు, కామెంట్లు వ‌స్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news