నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న
సంగీతం : జస్టిన్ ప్రభాకరన్
నిర్మాణం : మైత్రి – బిగ్ బెన్
దర్శకత్వం : భరత్ కమ్మ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు కలిసి నటించిన గీత గోవిందం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం.. డియర్ కామ్రేడ్.. ఈ చిత్రం ఇవాళ 4 భాషల్లో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఇవాళ ఈ సినిమా వారి ముందుకు వచ్చింది. మరి డియర్ కామ్రేడ్ మూవీ ప్రేక్షకులను ఎలా అలరించింది ? వారి అంచనాలను అందుకుందా.. లేదా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ…
బాబీ (విజయ్ దేవరకొండ)కు విప్లవ భావాలు ఎక్కువ. న్యాయం కోసం పోరాడే వ్యక్తి. అతను క్రికెట్ ప్లేయర్ లిల్లీ (రష్మిక)ను ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగోలా అతను ప్రేమలో దింపుతాడు. అయితే బాబీని ప్రేమించిన లిల్లీకి అతనికి ఆవేశం ఎక్కువ అనే విషయం తెలుస్తుంది. దీంతో లిల్లీకి అది నచ్చదు. ఆ క్రమంలోనే ఆమె అతని నుంచి విడిపోతుంది. అయితే ఆ తరువాత లిల్లీ, బాబీ ఇద్దరూ కలుస్తారా..? చివరకు ఏమవుతుంది ? అనే వివరాలను మాత్రం వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరు…
విజయ్ దేవర కొండ యాక్టింగ్ ఎలా చేస్తాడో మనందరికీ తెలుసు. అదే శైలిని అతను ఈ మూవీలోనూ ఫాలో అయ్యాడు. ఇక రష్మిక మందన్న కూడా విజయ్‌కి పోటీగా నటించింది. మిగిలిన నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పవచ్చు. అలాగే ఈ మూవీకి సంగీతం మరో ప్లస్ పాయింట్ అవుతుంది. మూవీలో ఫస్టాఫ్, సెకండాఫ్‌లలో వచ్చే పలు సీన్స్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. అయినా సరే.. మూవీలో విజయ్ యాక్టింగ్ ముందు అవన్నీ నిలబడవు. ఆవేశంతో రగిలిపోయే పాత్రలో విజయ్ అందరినీ మెప్పిస్తాడు. స్టూడెంట్ పాత్ర కావడంతో ఇక విజయ్ నటన మరింత మెప్పిస్తుంది. ఇక సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మూవీలో జస్టిన్ ప్రభాకరన్ అందించిన పాటలు, సంగీతం బాగున్నాయి. విజువల్స్ ఆకట్టుకుంటాయి. అయితే సినిమా స్లో నెరేషన్ కొంత నిద్ర తెప్పిస్తుంది. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే.. విజయ్‌కి.. డియర్ కామ్రేడ్ మూవీ రూపంలో మరొక హిట్ వచ్చినట్లే.. ప్రేక్షకులు నిరభ్యంతరంగా మూవీకి వెళ్లి ఒకసారి చూసి ఎంజాయ్ చేసి రావచ్చు..!
డియర్ కామ్రేడ్ మూవీ రివ్యూ, రేటింగ్: 3.25/5