సెక్స్ అంటే కేవలం అదే కాదు.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

సెక్స్ అంటే కేవలం అదే కాదు అంటోంది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె. దీపికా పదుకొణె తన గతాన్ని తలుచుకుంటూ, డేటింగ్ చేసిన సమయంలో ఎలా మోసపోయిందో చెప్పుకొంటూ అనేక విషయాలను వెల్లడించింది. గతంలో దీపికా రణ్‌బీర్ కపూర్‌తో రెండేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సంగతి తెలిసిందే. అయితే అనంతరం ఇద్దరూ విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అయితే తాజాగా దీపిక చేసిన కామెంట్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

తన వరకు సెక్స్ అంటే కేవలం శరీరాలు మాత్రమే కలవడం కాదు.. అందులో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయని చెప్పుకొచ్చింది. ఒక రిలేషన్ షిప్‌లో పదే పదే మోసం పోవడం గురించి చెప్పుకొస్తూ తన జీవితంలో జరిగిన సంఘటనలను వివరించింది. రెండో సారి ఛాన్స్ ఇచ్చానని, అయినా అప్పటికీ అందరూ చెబుతూనే వచ్చారని, అయితే తాను ఓసారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని అలా తన రిలేషన్ షిప్ ముగిసిందని వివరించింది.

ఒకసారి నమ్మకం, గౌరవం పోయాక ఆ వ్యక్తితో ఉండలేమని తెలిపింది. అయితే ఆ ఘటనల నుంచి బయటకు రావడానికి చాాలా సమయమే పట్టిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపికా రణ్‌వీర్ సింగ్‌ను చేసుకుని హ్యాపీగా ఉంది. మరోవైపు రణ్‌బీర్ కత్రినా కైఫ్‌తో వ్యవహారం నడిపి ప్రస్తుతం అలియాతో తిరుగుతున్నాడు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.