ప్రేమిస్తే ఏమౌతుంది తిరిగి ప్రేమించడం అన్నది చిన్న పని జీవితాంతం అదే పనిగా ఒక్కరినే తిరుగు లేకుండా ప్రేమించడమే పెద్ద పని చిన్న గీత అన్నది పెద్ద గీత దగ్గర చిన్నబోతుంది కనుక ప్రపంచాన్నీ దీపికానీ ఒకేసారి ప్రేమించడంలో సులువు ఉంది సోయగమూ ఉంది..ప్రేమని ప్రేమించడమే మీ పని! స్వీకరించడం ఆమె పని కూడా! బ్యూటీ స్పీక్స్ ఎలాట్….
అందం అన్న పదం దగ్గర మగాళ్లంతా ఆగిపోతారు. అందం అనే బంధం దగ్గర మగాళ్లంతా బానిసలు అయిపోతారు.మగువల అందం అన్నది ప్రత్యేకం అన్న భావనలో ఈ ప్రపంచం అంతా తనని తాను కొత్తగా నిర్వచించుకుంటుంది. కొత్త రంగులు పూసుకుని ముస్తాబై అమ్మాయిల అందాలతో పోటీ పడుతోంది. అవును!అందాల దీపిక కథ కూడా ఇలాంటిదే కావొచ్చు. ఇంతకుమించి కూడా ఉండవచ్చు.
ప్రేమ నిండిన కళ్లు, మత్తెక్కించిన చూపు ఈ రెండూ అమ్మాయిలు తమ ఆస్తులుగా కలిగి ఉంటారు. ప్రేమ అనే ఓ మాయా ప్రపంచం నుంచి అమ్మాయిలు లోకాన్ని చూడడం మొదలుపెడితే మగాళ్లంతా వాళ్లకు దాసోహం అయి ఉంటారు. ప్రేమ మరియు విరహం అనే రెండు చివరల దగ్గర అమ్మాయిలు ఉంటారు. ప్రేమ నుంచి విరహం వరకూ అమ్మాయిలు ప్రసాదించిన కోపంకానీ అమ్మాయిలు ప్రసాదించే నవ్వులు కానీ రెండూ కూడా బాగుంటాయి. కోపం అన్నది కంటి చివరన. నవ్వు అన్నది పెదవి అంచుల్లో
ఉంటూ ఉంటుంది కనుక ప్రేమ నిండిన అమ్మాయిలనే ప్రేమించాలి.. ఆ కోవలో దీపికా పదుకొనే ను ఇంకాస్త ఎక్కువ ప్రేమించాలి.
ముంబయి దారులకు తెలుసు దీపికా ఎవరో అన్నది. అదేవిధంగా ఆమె సాధించిన విజయాలకు తెలుసు దీపికా ఎంతన్నది.దీపికా అందంతో పాటు ఆత్మ విశ్వాసంలో కూడా చాలా ముందుండాలి అని భావించే అమ్మాయి.అవరోధాలు దాటుకుని విజయవంతం అయిన రీతిలో కెరియర్ ను నిర్మించుకున్న ధీశాలి. ఆమె కు కన్నీళ్లున్నాయి..ఆమెకు నిరాశలు ఉన్నాయి..కానీ వాటిని జయించిన ప్రేమ పూర్వక ఘట్టాలే ఆమెకు అపురూపాలు.డియర్ దీపికా ఆల్ ద బెస్ట్.